బీజాపూర్‌లో ఎదురుకాల్పులు : మావోయిస్టు మృతి

బీజాపూర్‌లో ఎదురుకాల్పులు : మావోయిస్టు మృతి

  ఛత్తీస్‌గఢ్ : బీజాపూర్ జిల్లాలోని బసుగడ్డ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు దాడి చేసేందుకు యత్నించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు మావోయిస్టులపై కాల్పులు జరిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు భద్రతా సిబ్బంది కూడా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలిలో మావోయిస్టులకు చెందిన ఆయుధాలు, సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.