బిజెపిని ఘాటుగా హెచ్చరించిన ముఫ్తీ

బిజెపిని ఘాటుగా హెచ్చరించిన ముఫ్తీ

  శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లో అధికారాన్ని చేపట్టేందుకు బిజెపి కుయుక్తలు పన్నుతోందని, తమ పార్టీని విచ్ఛిన్నం చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందని, ఇటువంటి యత్నాలు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ(పిడిపి) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ శుక్రవారం ఘాటుగా హెచ్చరించారు.ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఆరుగురు పిడిపి నేతలు పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. 1987లో మాదిరిగా ప్రజల ఓటు హక్కును కాలరాయాలని, రాష్ట్రంలో విభేదాలు సృష్టించి, లబ్దిపొందుదామని ప్రయత్నిస్తే సలాహుద్దీన్‌, యాసిన్‌ మాలిక్‌లాంటి వారు పుట్టుకొస్తారని గుర్తు చేశారు. 1931లో డోగ్రా రాచరికానికి వ్యతిరేకంగా తిరుగుబాటు సమయంలో అనేక మంది పౌరులు మరణించిన సందర్భంగా వారికి ప్రతి సంవత్సరం నివాళలు అర్పిస్తూ అమరవీరుల దినం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.