board-exams-150-schoolalo-andaru-fail

board-exams-150-schoolalo-andaru-fail

  అలహాబాద్: ప్రస్తుత కాలంలో పది, 12వ తరగతిలో ఓ విద్యార్థి అత్యధిక మార్కులు సాధించడం కొంచెం కష్టమేమో కానీ ఉత్తీర్ణత సాధించడం పెద్ద విషయమేం కాదు. ఆయా రాష్ర్టాల బోర్డులు నిర్వహించే వార్షిక పరీక్షలో ఒక్కో పాఠశాల నుంచి ఫెయిల్ అయినా వారి సంఖ్య అతి తక్కువ సంఖ్యలో ఉంటుంది. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని బోర్డు పరీక్షల్లో ఫెయిల్ అయిన వారి సంఖ్య చూస్తే నోరెళ్లబెడతారు. కొన్ని స్కూళ్లలోని పదో తరగతి విద్యార్థులందరూ కనీసం ఉత్తీర్ణత కూడా సాధించలేకపోవడం రాష్ట్రం మొత్తం చర్చనీయాంశమైంది.


ఉత్తర్‌ప్రదేశ్ సెకండరీ ఎడ్యూకేషన్ బోర్డ్(యూపీఎస్‌ఈబీ) ఆదివారం వెల్లడించిన ఫలితాల్లో 150 స్కూళ్లలోని పరీక్ష రాసిన విద్యార్థులంతా ఫెయిల్ అయ్యారు. సున్నా ఉత్తీర్ణత సాధించిన వాటిలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. 98 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పదో తరగతి పాస్ కాలేకపోయాడు. మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో 52 కళాశాలల్లో సున్నా శాతం ఉత్తీర్ణత సాధించారు. ఊహించని స్థాయిలో ఫలితాలను చూసిన అధికారులు విద్యాసంస్థల నుంచి వివరణ కోరారు. ఈ ఏడాది మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విద్యార్థులు పరీక్ష రాస్తున్న దృశ్యాన్నీ సీసీటీవీ కెమెరాల్లో చిత్రీకరించారు.