బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కు శంకుస్థాపన

బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కు శంకుస్థాపన

అహ్మ‌దాబాద్: జ‌పాన్ సాయంతో దేశంలో తొలి సారిగా నిర్మించనున్న బుల్లెట్ ట్రైన్ నిర్మాణ ప‌నుల‌కు ఇవాళ శంకుస్థాపన జ‌రిగింది.కొత్త పుంత‌లు తొక్కుతున్న ఈ సాంకేతిక యుగాన్ని అంది పుచ్చుకొని అగ్ర దేశాల స‌ర‌స‌న నిల‌బ‌డ‌టానికి భార‌త్ త‌న వంతు కృషి చేస్తున్న‌ది. ముంబై నుంచి అహ్మ‌దాబాద్ మ‌ధ్య బుల్లెట్ రైలు నిర్మాణ ప‌నుల‌కు మ‌న దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే ఇవాళ అహ్మ‌దాబాద్ లో శంకుస్థాప‌న చేశారు.

ముంబై నుంచి అహ్మ‌దాబాద్ మ‌ధ్య 508 కిమీలు ఈ రైలు మార్గాన్ని నిర్మించ‌నున్నారు. గ‌తేడాది న‌వంబ‌ర్ లో మోదీ జపాన్ ప‌ర్య‌ట‌నకు వెళ్లిన‌ప్పుడు ఈ బుల్లెట్ ట్రైన్ ప‌థ‌కానికి శ్రీకారం చుట్టారు. 2018 లో బుల్లెట్ ట్రైన్ నిర్మాణ ప‌నులు ప్రారంభం కానున్నాయి. 

జ‌పాన్ ప్ర‌ధాని షింజో అబే మాట్లాడతూ... శంకుస్థాప‌న లో నేను పాల్గొన‌డం ఆనందంగా ఉంది. జపాన్-భార‌త్ మ‌ధ్య సంబంధాలు మ‌రింత బ‌లోపేతం అవుతాయి, ఇరు దేశాలు క‌లిసి ప‌ని చేస్తే సాధించ‌లేనిది ఏమీ ఉండ‌దు, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా జ‌పాన్ ను ఆహ్వానించినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ  మాట్లాడతూ... ఇది న‌వ‌భారతం ఎన్నో క‌ల‌లు సాకారం చేసుకోవాల‌నుకుంటున్న‌ది ర‌హ‌దారులు, ర‌వాణా వ్య‌వ‌స్థ ద్వారా అభివృద్ధి సాధ్యం.రోడ్డు, విమాన‌, రైలు, జ‌ల ర‌వాణా ద్వారా దేశం మొత్తం అనుసంధానం, అమెరికాలో కూడా రైల్వే వ్య‌వ‌స్థ వ‌చ్చాకే అభివృద్ధి చెందింది.. 1964 లోనే జ‌పాన్ లో బుల్లెట్ రైలు ప‌రుగులు తీసింది.ఒక‌ప్పుడు పేద‌రికంతో జ‌పాన్ ఇబ్బందులు ఎదుర్కొంది.ఇప్పుడు ప్ర‌పంచానికి జ‌పాన్ ఆద‌ర్శంగా నిలుస్తున్న‌ది.

యూర‌ప్ నుంచి చైనా వ‌ర‌కు అన్ని దేశాలు జ‌పాన్ వైపు చూస్తున్నాయి.హైస్పీడ్ ర‌వాణా వ్య‌వ‌స్థ ద్వారా ఆర్థిక ప్ర‌గ‌తికి మార్గం సుగుమం.. హైస్పీడ్ అనుసంధానంతో ఉత్పాద‌క‌త పెంచాల‌న్న‌దే ల‌క్ష్యం.బుల్లెట్ రైలు కోసం భార‌త్ కు ఆర్థిక సాయం చేయడానికి జ‌పాన్ ముందుకొచ్చింది.. రూ. 88 వేల కోట్లు అతి స్వ‌ల్ప వ‌డ్డీకి రుణం మంజూరు చేసింది అని తెలిపారు.