సెంట్రల్‌ కోల్‌కతాలో అగ్ని ప్రమాదం

సెంట్రల్‌ కోల్‌కతాలో అగ్ని ప్రమాదం

 కోల్‌కతా : సెంట్రల్‌ కోల్‌కత్తాలో నిత్యం రద్దీగా ఉంటే పార్క్‌స్ట్రీట్‌లోని ఎనిమిది అంతస్తుల భవనంలో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ భవన సముదాయంలో పలు కంపెనీల కార్యాలయాలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న అధికారులు అపీజే హౌస్‌ వద్దకు పది అగ్నిమాపక యంత్రాలను తరలించారు. మంటలను అదుపుచేయడానికి సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. స్థానికులు ఘటనకు సంబంధించిన ఫోటోలు తీసి ట్వీట్‌ చేశారు. భవనంలోని కుటుంబాలను అగ్నిమాపక సిబ్బంది ఖాళీ చేయించారు. ఉదయం 11 గంటల సమయంలో మంటలు వ్యాపించినట్లు సమాచారం అందిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఈ భవన సముదాయం పార్క్‌ హోటల్‌కు సమీపంలోనే ఉంది. ఈ రెండు సంస్థలు అప్పీజే సురేంద్ర గ్రూపుకు చెందినవి.