చత్తీస్‌గడ్‌లో మందుపాతర పేలుడు

చత్తీస్‌గడ్‌లో మందుపాతర పేలుడు

  చింతూరు:బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఆరు రాష్ట్రాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన మావోయిస్టులు.. చత్తీస్‌గడ్‌ రాష్ట్రం సుక్మా జిల్లా జేగురుకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఐఇడి మందుపాతరను గురువారం పేల్చారు. ఈ ఘటనలో ఓ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ మృతి చెందారు. సుక్మా జిల్లా ఎస్‌పి మీనా తెలిపిన వివరాల ప్రకారం.. సుక్మా జిల్లా తమేలవాడ అటవీప్రాంతంలో పోలీస్‌ కోబ్రా బలగాలు గురువారం కూంబింగ్‌ నిర్వహించాయి. ఆ సమయంలో పోలీసులే లక్ష్యంగా ఐఇడి మందుపాతరను మావోయిస్టులు పేల్చారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌కుమార్‌ను జగదల్‌పూర్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందారు. రాజనంద్‌గావ్‌ జిల్లాలోని మాన్‌ పూరహల్‌ ఏరియాలో ఉన్న వెదురు డిపోను మావోయిస్టులు దగ్ధం చేశారు. సుమారు రూ.10 లక్షల వరకూ ఆస్తినష్టం వాటిల్లింది. బీజాపూర్‌ జిల్లా కోహకి-కొర్‌కట్టా రహదారులపై చెట్లను నరికి అడ్డంగా పడవేశారు. బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా చేపట్టిన బంద్‌ను జయప్రదం చేయాలని పోస్టర్లను రోడ్లపై ప్రదర్శించారు.