దళితుడికి బలవంతంగా మూత్రం తాగించారు..

దళితుడికి బలవంతంగా మూత్రం తాగించారు..

  లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో అగ్రకులాలకు చెందిన రైతులు మానవత్వాన్ని మరిచారు. ఓ దళితుడికి బలవంతంగా మూత్రం తాగించారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. తన పంటపొలాన్ని సాగు చేయడానికి నిరాకరించాడన్న కోపంతో ఓ భూసామి.. దళితుడికి బలవంతంగా మూత్రం తాగించారు. దళితుడిని తీవ్రంగా చితకబాది.. నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు. చెప్పులతో కొట్టారు. ఆ తర్వాత ప్రజలందరూ చూస్తుండగానే.. దళితుడికి మూత్రం తాగించారు. బాధితుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో విజయ్ సింగ్, విక్రమ్ సింగ్, సోమ్‌పాల్ సింగ్, పింకును అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.