డార్జిలింగ్‌ ఘర్షణలో పోలీస్‌ హత్య?

డార్జిలింగ్‌ ఘర్షణలో పోలీస్‌ హత్య?

 డార్జిలింగ్‌(పశ్చిమ్‌బంగా): ప్రత్యేక గూర్ఖాలాండ్‌ డిమాండ్‌ చేస్తూ గుర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారింది.పోలీసులు, ఆందోళనకారులకు మధ్య శనివారం జరిగిన ఘర్షణలో ఓ పోలీస్‌ అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఇండియన్‌ రిజర్వ్‌ బెటాలియన్‌కు చెందిన అసిస్టెంట్‌ కమాండర్‌ను ఆందోళనకారులు పొడిచి హత్య చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. మరోవైపు భద్రతాసిబ్బంది జరిపిన కాల్పుల్లో ఇద్దరు జీజేఎం మద్దతుదారులు మృతిచెందినట్లు ఆ పార్టీ ఆరోపిస్తోంది.

                 గత కొన్ని రోజులుగా గూర్ఖాలాండ్‌ అల్లర్లతో అట్టుడుకిపోతున్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి నుంచి ఘర్షణ కాస్తా తీవ్ర రూపం దాల్చింది. శనివారం ఆందోళనకారులు రోడ్లపైకి చేరి పోలీసులపై రాళ్లు, గాజు సీసాలు విసిరేశారు. దాంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు భాష్ప వాయుగోళాలను ప్రయోగించి లాఠీఛార్జి చేశారు. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.