ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి  మృతి

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి  మృతి

   న్యూఢిల్లీ : ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి సీనియర్‌ నేత మదన్‌ లాల్‌ ఖురానా (82) శనివారం రాత్రి ఇక్కడి కృతినగర్‌లోని ఆయన నివాసంలో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా జ్వరం, ఛాతీకి సంబంధించిన రోగాలతో బాధపడుతున్న ఆయన రాత్రి 11 గంటలకు తుదిశ్వాస విడి చారని కుమారుడు హరిస్‌ ఖురానా తెలిపారు. మదన్‌లాల్‌ 1936 అక్టోబర్‌ 15న జన్మించారు. ఆయన 1993-96కు మధ్య ఢిల్లీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అటల్‌ బీహార్‌ వాజ్‌పేరు ప్రభుత్వంలో పర్యాటక మంత్రిగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా వ్యవహరించారు. 2004లో రాజ స్తాన్‌ గవర్నర్‌గా కూడా పదవి బాధ్యతలు నిర్వర్తించారు. మదన్‌లాల్‌ ఖురానాకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు గత ఆగస్టులో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రి హర్ష్‌ వర్దన్‌ సంతాపాన్ని తెలియజేశారు.