డిఎంకె అధినేత కరుణానిధి క‌న్ను‌మూత‌

డిఎంకె అధినేత కరుణానిధి క‌న్ను‌మూత‌

  చెన్నై : డిఎంకె అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి (94)క‌న్ను‌మూశారు. ఆయ‌న‌ ఆరోగ్యం మరింత విషమించినట్లు కావేరి ఆసుపత్రి తాజా హెల్త్‌ బులెటిన్‌ను మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. కొన్ని గంటలుగా అవయవాలు చికిత్సకు సహకరించడంలేదని తెలిపారు. చికిత్స అందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు.

వృద్ధాప్యం కారణంగా ఆయన శరీరంలోని అంతర్గత అవయవాలు చికిత్సకు స్పందించే స్థితిలో లేనట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో కావేరి ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కావేరి ఆసుపత్రితో పాటు రాజారత్నం స్టేడియంలోనూ పోలీసులను భారీగా మొహరించారు. ఆస్పత్రి పరిసరాలతో పాటు చెన్నైలోని కరుణానిధి నివాసంతో పాటు పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆస్పత్రి ప్రాంగణంలో డిఎంకె కార్యకర్తలు, అభిమానుల రోదనలు మిన్నంటాయి. రెండు రోజుల పాటు ప్రభుత్వ కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. 

 కాగా, కరుణానిధి కుమారుడు, డిఎంకె వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ ఈరోజు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసి తన తండ్రి ఆరోగ్య వివరాలు వివరించారు. మరోవైపు తమిళనాడు డీజీపీ రాష్ట్రం అంతటా హైఅలర్ట్‌ ప్రకటించారు. జిల్లాల్లో ఉన్న పోలీసు అధికారులు అంతా చెన్నైకి రావాలని, సెలవుల్లో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించారు. ఢిల్లీలో ఉన్న తమ ఎంపీలు, నాయకులు చెన్నైకి రావాల్సిందిగా డీఎంకే పార్టీ కార్యాలయం ఆదేశించింది.
.