ఈ నెల 10న భారత్‌ బంద్‌..!

ఈ నెల 10న భారత్‌ బంద్‌..!

  హైదరాబాద్‌ : రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, వామపక్షపార్టీలు  సోమవారం (సెప్టెంబర్‌ 10) నాడు భారత్‌బంద్‌కు పిలుపునిచ్చాయి. అంతకంతకూ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సగటు వాహనదారుడి జేబుకు చిల్లులు పడుతున్నాయి. మరోవైపు నిత్యావసర ధరలు కూడా మండిపోతున్నాయి. శుక్రవారం దాదాపు 50 పైసల వరకు ఇంధన ధరలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోలు 79.99, డీజిల్‌ 72.09 రూపాయలకు చేరింది. గత నెల రోజులుగా డీజిల్‌ ధర 4 రూపాయలు, పెట్రోలు ధర 3 రూపాయలు వరకు పెరిగింది.