ఎన్‌కౌంట‌ర్‌లో మ‌హిళా మావోయిస్టు మృతి

ఎన్‌కౌంట‌ర్‌లో మ‌హిళా మావోయిస్టు మృతి

  కిడారి, సోమ‌న హ‌త్యలో పాల్గొన్న మ‌హిళా మావోయిస్టు మీనా ఆంధ్రా, ఒడిశా స‌రిహ‌ద్దుల్లో శుక్ర‌వారం ఉద‌యం జ‌రిగిన పోలీసుల కాల్పుల్లో మ‌రణించింది. ఎమ్మెల్యే కిడారి హ‌త్య కేసులో నిందితురాలుగా ఉన్న మీనా..గాజ‌ర్ల ర‌వి అలియాస్ గ‌ణేష్ భార్య‌గా గుర్తించారు. అర‌కు ఎన్‌కౌంట‌ర్‌లో నిందితులుగా ఉన్న మ‌రో న‌లుగురు రాధిక‌, గీత‌, రాజ‌శేఖర్‌, జ‌యంతిల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా కాల్పుల అనంత‌రం ఏవోబీలో ముమ్మ‌ర కూంబింగ్ కొన‌సాగుతోంది.