ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతం

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు హతం

 జార్ఖండ్‌ : హజిరాబాగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తీవ్రవాదులు మృతి చెందినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. సిఆర్‌పిఎఫ్‌ కు చెందిన 22 బృందాలు దొనారుకుర్ద్‌ గ్రామంలో గురువారం అర్థరాత్రి సమయంలో మావోయిస్టుల కోసం వెతుకుతుండగా ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుందని సిఆర్‌పిఎఫ్‌ అధికారులు పేర్కొన్నారు. మావోయిస్టుల నుండి ఎకె 47, ఇన్‌సాస్‌ రైఫిల్‌, 200 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టులు ఎవరనేది ఇంకా నిర్థారణ కాలేదని తెలిపారు.