ఎన్నికల వేళ గృహనిర్బంధంలో ఏర్పాటు వాదులు

ఎన్నికల వేళ గృహనిర్బంధంలో ఏర్పాటు వాదులు

 శ్రీనగర్‌ : కాశ్మీర్‌ లోయలో మొదటి దశ స్థానిక సంస్థల ఎన్నికలు సోమవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొదటి విడతగా 12 జిల్లాల్లోని 30 మున్సిపాలిటీలో 422 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1,283 అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో పోటీపడుతున్నారు. కాగా, ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు చోటుచేసుకుండా ఏర్పాటువాద నాయకుల్ని పోలీసులు ముందస్తుగా గఅహనిర్బంధంలో ఉంచారు. మీర్వాజ్‌ ఉమర్‌ ఫరూఖ్‌, సయ్యద్‌ అలీ షా గిలానీలకు ఆదివారం సాయంత్రం నుండే గృహనిర్బంధాన్ని విధించారు. 

యాసిన్‌ మాలిక్‌, హిలాల్‌ వార్‌, మరి కొంత మంది ఏర్పాటువాద నాయకుల్ని గ అహనిర్భందం చేసి ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు. 13 ఏళ్ల అనంతరం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను.. ప్రధాన పార్టీలైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌స్సీ), పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు సాయత్రం 4 గంటలకు ముగయనున్నాయి. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్‌ 35(ఎ)పై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆ రెండు పార్టీలు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గతంలో ప్రకటించాయి. ప్రధాన పార్టీలు రెండూ బరిలో నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్‌, బిజెపి మధ్యే పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేస్తామని బిజెపి నేత, రాష్ట్ర మాజీ సీఎం కవీంద్ర గుప్తా ధీమా వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో అలర్లు జరిగే అవకాశం ఉన్నందున్న కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని భద్రత దళాలు ప్రకటించాయి.