ఇరుముడి లేకుండానే గర్భగుడిలోకి..

ఇరుముడి లేకుండానే గర్భగుడిలోకి..

   కొచ్చి : వయసుతో నిమిత్తం లేకుండా మహిళలందరూ శబరిమల ఆలయంలోకి ప్రవేశించవచ్చు అంటూ సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, సంప్రదాయం పేరిట వారిని సంఫ్‌ు పరివార్‌ అడ్డుకుంటున్న నేపథ్యంలో అదే ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన నేత ఒకరు శబరిమల గుడి సంప్రదాయాన్ని ఉల్లంఘించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మహిళల ఆలయ ప్రవేశాన్ని అడ్డుకునేందుకు సన్నిధానంలోనూ, పదునెట్టాంపడి (18 మెట్ల) వద్ద ఆందోళనకారులకు నేతృత్వం వహించిన స్థానిక ఆరెస్సెస్‌ నేత వాల్సన్‌ తిల్లంకెరి ఎటువంటి ఇరుముడి లేకుండానే పదునెట్టాంపడినెక్కి ఆలయ అంతర్భాగమైన గర్భగుడిలోకి వెళ్లారు. వాస్తవానికి ఆలయ సంప్రదాయం ప్రకారం పదునెట్టాంపడి మార్గంలో అయ్యప్పను దర్శించుకునేందుకు ఇరుముడి ధరించిన దీక్షాధారులు మాత్రమే అర్హులు. ఈ సాంప్రదాయాన్ని తుంగలోతొక్కిన తిల్లంకేరి ఇరుముడీ లేకుండానే 18 మెట్లనూ ఎక్కి పైకి వెళ్లటంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. వారు ఆ స్థితి నుండి తేరుకునే లోపే మళ్లీ ఆయన అదే మార్గంలో కిందికి దిగి వచ్చారు.