ఫేస్‌బుక్ ఇండియా ఎండీ రాజీనామా

ఫేస్‌బుక్ ఇండియా ఎండీ రాజీనామా

ముంబై: నేడు ఫేస్‌బుక్ ఇండియా ఎండీ ఉమంగ్ బేడీ తన పదవికి రాజీనామా చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఆయన స్థానంలో సౌత్ ఏషియా కన్జూమర్ అండ్ మీడియా డైరెక్టర్ సందీప్ భూషణ్‌ను తాత్కాలిక ఎండీగా నియమించినట్లు చెప్పింది. ఫేస్‌బుక్ ఇండియా ఎండీగా గతేడాది ఉమంగ్ బాధ్యతలు చేపట్టారు.

అంతకుముందు ఆయన అడోబ్ సౌత్ ఏషియా ఎండీగా పనిచేశారు. ఫేస్‌బుక్‌కు గుడ్ బై చెప్పిన తర్వాత సొంతంగా ఓ సంస్థ ప్రారంభించాలని ఉమంగ్ బేడీ భావిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఉమంగ్ బేడీ తన పదవి నుంచి తప్పుకోనున్నారు.

 తన హయాంలో ఆయన బలమైన టీమ్‌ను, వ్యాపారాన్ని విస్తరించగలిగారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా తర్వాత ఫేస్‌బుక్‌కు ఎక్కువ యూజర్లు ఉన్నది ఇండియాలోనే ఉన్నారు. ఆయనకు ఆల్ ద బెస్ట్ అంటూ ఫేస్‌బుక్ ఓ ప్రకటన విడుదల చేసింది.