ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లును ఉపసంహరించుకున్న కేంద్రం

ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లును ఉపసంహరించుకున్న కేంద్రం

  న్యూఢిల్లీ : ఎఫ్‌ఆర్‌డిఐ (ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌) బిల్లును ప్రభుత్వం మంగళవారం లోక్‌సభ నుండి ఉపసంహరించుకుంది. ఈ బిల్లులోని నిర్దిష్ట నిబంధనల పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తం కావడంతో బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఏడాది తర్వాత ఈ చర్య తీసుకుంది. గతేడాది ఆగస్టు 10న బిల్లును సభలో ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంట్‌ సంయుక్త కమిటీకి నివేదించారు. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పాన్‌ రాధాకృష్ణన్‌ బిల్లును ఉపసంహరించాలని ప్రతిపాదించగా, సభ ఆమోదించింది. గత వారం కమిటీ తన నివేదికను అందచేసింది. బిల్లును ఉపసంహరించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించింది. సంక్షోభంలో వున్న ఆర్థిక సంస్థల సమస్యలను సమర్థవంతంగా, సత్వరమే పరిష్కరించేందుకు స్వతంత్ర పరిష్కార కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ఈ బిల్లు కోరుతోంది. ఈ బిల్లులోని బెయిల్‌-ఇన్‌ నిబంధనపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ బిల్లు ఉపసంహరణకు గల కారణాలను కారణాలను కమిటీకి తెలియచేశారు.