గోరఖ్‌పూర్‌లోని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సస్పెండ్

 గోరఖ్‌పూర్‌లోని మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సస్పెండ్

గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ ఆస్పత్రిలో మెదడువాపు వ్యాధితో బాధపడుతున్న 30 మంది చిన్నారులు అక్సిజన్ అందక మృతి చెందిన సంగాటనలో ఐదు రోజుల్లో 63 మంది చిన్నారులు చనిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు . ఆస్పత్రిలో ఆక్సిజన్ కావాల్సిన స్థాయిలో అందుబాటులో లేదని, ఈ విషయాన్ని సాంకేతిక సిబ్బంది అధికారులకు చెప్పినప్పటికీ..దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.

అయితే ఈ ఘటనపై  ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వహించడం వల్లే ఐదు రోజుల్లో 63 మంది చిన్నారులు చనిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. యూపీ మెడికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అశుతోష్ టాండన్ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సిద్ధార్థ్‌నాథ్ సింగ్‌తో చిన్నారుల మృతిపై చర్చించారు.

అనంతరం ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రకటించారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టి త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం ఆదిత్య‌నాథ్ ఆరోగ్య శాఖ అధికారుల‌కు ఆదేశించారు.