GST పేరుతో మోడీ మోసం చేస్తున్నారు

GST పేరుతో మోడీ మోసం చేస్తున్నారు

గుజరాత్: రాహుల్ గాంధీ ఈ రోజు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు.ఈ సందర్భంగా కేంద్రం ని టార్గెట్ గా విమర్శలు చేశారు. GSTతో మోడీ మోసం చేస్తున్నారని ఈ శ్లాబురేట్లనీ తీసేసి...దేశంమొత్తంలో అన్నింటిపైనా ఒకే పన్ను ఉంచాలని డిమాండ్ చేశారు.GSTతో దేశంమొత్తం ఒకేవిధమైన పన్ను అనిచెప్పిన మోడీ ఇపుడు 28శాతం, 18శాతం అంటూ శ్లాబులు ఎందుకు పెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

అంతకు ముందు గాంధీ నగర్లోని అక్షరధాం ఆలయానికి వెళ్లారు రాహుల్. గుడి పూజారులు ఆయనకు స్వాగతం పలికారు. తర్వాత ప్రత్యేక పూజలు చేసిన రాహుల్ కు తీర్థప్రసాదాలు అందించారు. తర్వాత ఆలయ పరిసరాలను తిరిగి చూశారు. అక్షరధాం విశిష్టతను రాహుల్ కు వివరించారు పూజారులు.