జీఎస్టీ వల్ల ఉద్యోగాలు కోల్పోయారు

జీఎస్టీ వల్ల ఉద్యోగాలు కోల్పోయారు

హిమాచల్‌ ప్రదేశ్‌: కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇవాళ హిమాచల్‌ ప్రదేశ్‌లో పర్యటించారు. మండిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు...మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేశారు. జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం తొందరపాటుగా అమలు చేసిందని రాహుల్‌ విమర్శించారు. జీఎస్టీ వల్ల యువత ఉద్యోగాలు కోల్పోతుందన్నారు.

గుజరాత్‌లో సుమారు 30 లక్షల మంది యువత ఉద్యోగాలు కోల్పోయినట్లు రాహుల్‌ తెలిపారు. నిరుద్యోగమే ఇప్పుడు దేశంలో అతిపెద్ద సమస్యగా మారిందని కాంగ్రెస్‌ నేత అన్నారు. జాబ్‌ క్రియేషన్‌లో గుజరాత్‌ కన్నా.. హిమాచల్‌ ప్రదేశ్‌ ముందు ఉందన్నారు. ప్రస్తుతం మోదీ.. గుజరాత్‌ పర్యటనలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో రాహుల్‌...ప్రధానిని టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేశారు. దీపావళి తర్వాత కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు రాహుల్‌ స్వీకరిస్తారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో రాహుల్‌.. ప్రధానిపై ఎక్కువగా విమర్శలు చేస్తున్నాటు తెలుస్తున్నది.