హర్యానా రవాణా సమ్మెకు ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు

హర్యానా రవాణా సమ్మెకు ప్రభుత్వ ఉద్యోగుల మద్దతు

  చండీఘర్‌ : ప్రభుత్వ రవాణా కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీబావం తెలిపేందుకే సుమారు రెండు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవు తీసుకున్నారని హర్యానా సర్వ కర్మచారి సంఘం (ఎస్‌కెఎస్‌) వెల్లడించింది. 102 కార్మికుల యూనియన్‌లు ఒకే సమితి కింద ఏర్పడిన ఈ సంఘం ఈ సంఘానికి మద్దతు తెలిపేందుకు వారు సెలవు తీసుకున్నారని తెలిపారు. కాగా, ప్రైవేటు బస్సులను కూడా అనుమతించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు అక్టోబర్‌ 16 నుండి సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మె అక్టోబర్‌ 29వరకు కొనసాగనుంది. తమ పిలుపుకు స్పందించి రెండు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవు తీసకున్నారని ఎస్‌కెఎస్‌ జనరల్‌ సెక్రటరీ సురేష్‌ లంభా వెల్లడించారు.