హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రభుత్వాధికారి హత్య

హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రభుత్వాధికారి హత్య

 న్యూఢిల్లీ: హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒక హోటల్‌ యజమాని ప్రభుత్వ అధికారి ఒకరిని కాల్చిచంపిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. 'అత్యంత తీవ్రమైన ఈ నేరం'పై సమగ్ర దర్యాప్తు జరిపి తమకు నివేదిక అందించాలని హిమాచల్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కసౌలీ పట్టణంలో అక్రమంగా నిర్మించిన ఒక హోటల్‌ భవనాన్ని నగరపాలక సంస్థ అధికారి, ఇతర సిబ్బంది కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేస్తున్న సమయంలో ఆ హోటల్‌ యజమాని వారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నగరపాలక సంస్థ అధికారి ప్రాణాలు కోల్పోవటంతో ఆ యజమాని అక్కడి నుండి పరారయ్యాడు. నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు అతడి ఆచూకీ చెప్పిన వారికి రు.లక్ష రివార్డును ప్రకటించారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు 'అత్యంత తీవ్రమైన ఈ నేరం'పై సమగ్ర దర్యాప్తు జరిపి తమకు నివేదిక అందచేయాలని హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.