హింస వద్దు, ప్రశాంతంగా ఉండండి!

హింస వద్దు, ప్రశాంతంగా ఉండండి!

 న్యూఢిల్లీ : హింసకు తావీయొద్దని, ప్రశాంతంగా ఉండా లని డార్జిలింగ్‌ ప్రజానీకానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక గోర్ఖాలాండ్‌ను కోరు తూ చేపట్టిన ఆందోళనను కొనసాగిస్తామని జిజెఎం అధ్యక్షు లు బిమల్‌ గౌరాంగ్‌ ప్రకటించిన నేపథ్యంలో రాజ్‌నాథ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ మధ్య నెలకొన్న విబేధాలను, అపార్థాలను అన్ని రాజకీయ, భాగస్వామ్య పార్టీలు సామరస్య పూర్వక వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రాజ్‌నాథ్‌ సూచించారు. 

భారత్‌ వంటి ప్రజాస్వామ్య దేశంలో హింసాత్మక చర్యలు పరిష్కారాన్నివ్వలేవన్నారు. పరస్పర చర్చలతోనే ప్రతి అంశానికి పరిష్కారం లభిస్తోందని రాజ్‌నాథ్‌ చెప్పారు. డార్జిలింగ్‌, సమీప ప్రాంత ప్రజలు శాంతియుతంగా ఉండాలని పలు ట్వీట్ల ద్వారా విజ్ఞప్తి చేశారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఉదయం మాట్లాడి డార్జిలింగ్‌లో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నాని ఇక్కడ మీడియాకు ఆయన తెలిపారు. డార్జిలింగ్‌లోని పాఠశాలల్లో బెంగాలీ భాషను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా డార్జిలింగ్‌ ప్రజలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులు తమ ఆందోళనలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే మరిన్ని హింసాత్మక సంఘటనలు జరుగుతాయని జిజెఎం అధ్యక్షులు బిమల్‌ గౌరాంగ్‌ హెచ్చరించారు. తమ ఆందోళనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. 

గూర్ఖాల్యాండ్‌ పోరాటాన్ని మరింత తీవ్రతరం
'కొన్ని తిరుగుబాటు గ్రూపులు డార్జిలింగ్‌లో అల్లర్లను పెంచిపోషిస్తున్నాయి' అని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించడాన్ని గూర్ఖా జనముక్తి మోర్చా అధినేత బిమల్‌గురంగ్‌ తప్పుబట్టారు. మమత పచ్చి అబ ద్దాలు చెబుతున్నారన్నారు. తమ పోరాటం ప్రత్యేక గూర్ఖా ల్యాండ్‌ కోసం జరుగుతోందన్నారు. డార్జిలింగ్‌లో అల్లర్లపై శనివారం మమతాబెనర్జీ మాట్లాడుతూ పోరాటం ఒక కుట్ర గా అభివర్ణించిన సంగతి తెలిసిందే. కొన్ని దేశీయ, విదేశీ శక్తు లు నడిపిస్తున్న లోతైన కుట్ర అని ఆమె పేర్కొన్నారు.

అయితే ఈ ఆరోపణలు ఆధార రహితమనీ, మమతా బెనర్జీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బిమల్‌ పేర్కొన్నారు. తమది రాజ కీయ పోరాటం కాదనీ, గూర్ఖాలు ఉనికి కోసం చేస్తున్న పోరా టమని అన్నారు. గూర్ఖాల్యాండ్‌ సాధించే వరకు తమ పోరా టం ఆగదన్నారు. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వంతో చర్చించేం దుకు తాము సిద్ధంగాలేమన్నారు. పోలీసు కాల్పుల్లో ఇద్దరు స్థానికులు మృతిచెందడంతో, డార్జిలింగ్‌లో మరోమారు జిజెఎం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాలు జరి గాయి. తమ కార్యకర్తలను శనివారం పోలీసులు సింగమరిలో కాల్చి చంపారని నిరసనకారులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. ఘర్షణల సమయంలో ఒక వ్యక్తి మృతిచెందారన్నారు.