‘జమ్మూ కాశ్మీర్‌లో కేంద్రం జోక్యం లేదు’

‘జమ్మూ కాశ్మీర్‌లో కేంద్రం జోక్యం లేదు’

  జమ్మూ కాశ్మీర్‌ విషయంలో కేంద్రం జోక్యం లేదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. ఈనెల 21న రాష్ట్ర అసెంబ్లీ రద్దు చేయడానికి దారి తీసిన రాజకీయ పరిస్థితులను ఎదుర్కొనడంలో గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌కు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదని తెలిపారు. పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యతను గవర్నర్‌కే వదిలిపెట్టినట్లు చెప్పారు. అయితే కొన్ని రోజుల క్రితం గ్వాలియర్‌లో ఒక కార్యక్రమానికి హాజరైన మాలిక్‌ మాట్లాడుతూ, ఢిల్లీ ఎంపికను ప్రోత్సహించినట్లైతే సజ్జద్‌ లోనే ముఖ్యమంత్రి అయి వుండేవారని వ్యాఖ్యానించారు. కానీ తాను అలా చేయలేదని అన్నారు. చరిత్రలో నిజాయితీ లేని వ్యక్తిగా మిగిలిపోకూడదనే తాను అలా చేయలేదని మాలిక్‌ చెప్పారు. దీనిపై రాజ్‌నాథ్‌ సింగ్‌ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.