జమ్మూకశ్మీర్‌లో భారీ హిమపాతం

జమ్మూకశ్మీర్‌లో భారీ హిమపాతం

  శ్రీనగర్‌: మంచువర్షంతో హిమాలయ రాష్ట్రాలు శ్వేతవర్ణం అద్దుకున్నాయి. జ‌మ్మూక‌శ్మీర్‌తోపాటు హిమాచ‌ల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ల్లో గత నాలుగురోజులుగా భారీగా హిమపాతం నమోదవుతోంది. శ్రీన‌గ‌ర్‌లోని అనేక ప్రాంతాలను తొల‌క‌రి మంచు ప‌ల‌క‌రించింది. రాజౌరీ, సోన్‌మార్గ్‌లో రోడ్లపై అడుగులమేర మంచు పేరుకుపోవడంతో.. అధికారులు క్లీనింగ్‌ చర్యలు చేపట్టారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌తోపాటు గంగోత్రి, యమునోత్రి క్షేత్రాల్లోనూ భారీగా మంచు కురుస్తోంది.