జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

  శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని టికెన్ గ్రామ సమీపంలో ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నారని శుక్రవారం సాయంత్రం భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో నిన్న సాయంత్రం నుంచి బలగాలు అక్కడ కూంబింగ్ నిర్వహించాయి. ఇవాళ ఉదయం ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. ఘటనాస్థలి నుంచి బలగాలు తుపాకులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఇద్దరు ఉగ్రవాదులు హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. నిన్న జైషే మహ్మద్ ఉగ్రవాదిని పుల్వామా జిల్లాలోని త్రాల్ వద్ద బలగాలు హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ఒక పోలీసు గాయపడ్డాడు.