జమ్ము కాశ్మీర్‌లో గుండెపోటుతో బిజెపి అభ్యర్ధి మృతి

జమ్ము కాశ్మీర్‌లో గుండెపోటుతో బిజెపి అభ్యర్ధి మృతి

  శ్రీనగర్‌ : జమ్ము కాశ్మీర్‌లోని రాంబాన్‌ జిల్లాలో జరుగుతున్న రెండవ విడత మున్సిపల్‌ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోకుండానే బిజెపి అభ్యర్థి బుధవారం గుండెపోటుతో మరణించారు. నీటి పారుదల, వరద నియంత్రణ శాఖ మాజీ ఉద్యోగి అయిన ఆజాద్‌ సింగ్‌ రాజు స్థానిక పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేయడానికి వచ్చిన సమయంలో గుండెపోటు వచ్చిందని, అనంతరం ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు మృతి చెందినట్లు వెల్లడించారని అధికారులు తెలిపారు. రాంబాన్‌ జిల్లాలోని ఏడు పురపాలక సంఘాలకు పోటీచేసిన 24 మంది అభ్యర్థుల్లో రాజు ఒకరు. జమ్ము ప్రాంతంలోని కిష్వ్తార్‌, దోడ, రాంబాస్‌, రేయిసీ, ఉదంపూర్‌, కథువాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 263 మున్సిపల్‌ వార్డులకు ఈ రోజు పోలింగ్‌ జరుగుతోంది.