జమ్ముకాశ్మీర్‌లో లోయలోపడ్డ మినిబస్సు-13మంది మృతి

జమ్ముకాశ్మీర్‌లో లోయలోపడ్డ మినిబస్సు-13మంది మృతి

    శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసకుంది. ప్రయాణికులతో వెళ్తున్న మిని బస్సు కిష్టావర్‌ జిల్లాలో తక్రియా వద్ద అదుపుతప్పి 300 మీటర్ల లోతు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 13మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మ అతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఉదయం కేశ్వాన్‌ నుంచి కిష్టావర్‌ బయలుదేరిన బస్సు దండారన్‌ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అధికార యంత్రాంగం సహాయక బ అందాలను రంగంలోకి దింపింది. సహాయక చర్యలు చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు.