జ‌మ్మూకాశ్మీర్‌లో విరిగిప‌డ్డ కొండచరియలు

జ‌మ్మూకాశ్మీర్‌లో విరిగిప‌డ్డ కొండచరియలు

   శ్రీనగర్‌ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాంబాన్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో కీలకమైన జమ్ము - శ్రీనగర్‌ జాతీయ రహదారిని శనివారం తాత్కాలికంగా మూసివేశామని అధికారులు తెలిపారు. రామ్‌సూలోని బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ కార్యాలయం సమీపంలో కొండచరియలు పడటంతో ఆ రహదారి దిగ్బంధనమైందని తెలిపారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయన్నారు. సహాయ చర్యలు చేపట్టామని, సాధ్యమైనంత త్వరగా రోడ్డును పునరుద్ధరిస్తామన్నారు.