జ‌మ్మూలో ఎన్‌కౌంట‌ర్‌...ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం

జ‌మ్మూలో ఎన్‌కౌంట‌ర్‌...ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం

  జ‌మ్మూ కాశ్మీర్ :  జ‌మ్మూకాశ్మీర్‌లోని ప‌లు ప్రాంతాల్లో జ‌రిగిన ఎదురు కాల్పుల్లో ఇప్ప‌టివర‌కు ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. బారాముల్లా జిల్లాలో సైన్యం, ఉగ్ర‌వాదుల మ‌ధ్య జ‌రిగిన ఎదురు కాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు, సోఫోర్‌లోని చింకిపొర ప్రాంతంలో ఒక ఉగ్ర‌వాదిని సైన్యం కాల్చి చంప‌గా, ముష్క‌రులు జ‌రిపిన కాల్పుల్లో ఓ డీఎస్పీ స‌హా 12 మంది భ‌ద్ర‌తా సిబ్బంది గాయ‌ప‌డ్డారు. చ‌నిపోయిన ఉగ్ర‌వాదులు జైషేమ‌హ్మ‌ద్‌కు చెందిన వారిగా గుర్తించారు.