జమ్మూలో పాక్‌ రేంజర్స్‌ కాల్పులు

జమ్మూలో పాక్‌ రేంజర్స్‌ కాల్పులు

  జమ్మూ : జమ్మూలోని రామ్‌ఘర్‌ సెక్టార్‌లో మంగళవారం రాత్రి జరిగిన పాక్‌ కాల్పుల్లో నలుగురు బిఎస్‌ఎఫ్‌ సిబ్బంది మరణించారు. ముగ్గురు గాయపడ్డారు. మంగళవారం రాత్రి 9.40 గంటల సమయంలో సరిహద్దు ఔట్‌పోస్ట్‌పై ఎలాంటి కవ్వింపులు లేకుండానే పాకిస్తాన్‌ రేంజర్స్‌ కాల్పులు జరిపారని బిఎస్‌ఎఫ్‌ ప్రతినిధి తెలిపారు. భారత్‌ వైపు మరణాలు సంభవించేలా హై ట్రాజెక్టరీ ఆయుధాలను పాక్‌ ఉపయోగించిందని చెప్పారు. వెంటనే మన భద్రతా బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయని, పరస్పర కాల్పుల్లో నలుగురు బిఎన్‌ఎఫ్‌ జవాన్లు మృతి చెందారని తెలిపారు. మరణించిన వారిలో అసిస్టెంట్‌ కమాండెంట్‌ జితేందర్‌ సింగ్‌, సబ్‌ ఇనస్పెకర్టర్‌ రజనీష్‌, అసిస్టెంట్‌ సబ్‌ ఇనస్పెక్టర్‌ రాంనివాస్‌, కానిస్టేబుల్‌ హంసరాజ్‌లు వున్నారు. గాయపడిన వారిని తక్షణమే వైద్య సాయం నిమిత్తం ఆస్పతికి తరలించారు.