>

కామసూత్ర పుస్తకాలపై నిషేధం!

కామసూత్ర పుస్తకాలపై నిషేధం!

 ఛతర్‌పూర్: మధ్యప్రదేశ్‌లోని ఖజూరహో దేవాలయంలో కామసూత్ర పుస్తకాల అమ్మకాన్ని నిషేధించాలంటూ ‘భజరంగ్ సేన’ కార్యకర్తలు ఛతర్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖజురహో ఆలయాల్లోని ప్రముఖ పశ్చిమ దేవాలయ సముదాయాల్లో... కామసూత్ర పుస్తకాలు, అశ్లీల చిత్రాలు అమ్మడం వల్ల భారత సంస్కృతికి అపఖ్యాతి వస్తోందని వారు ఆరోపించారు. విదేశీ టూరిస్టుల్లో భారత సంస్కృతి పట్ల చులకన భావం ఏర్పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

వాస్తవానికి ఆలయ గోడల మీద శృంగార బొమ్మలతో ఖజూరహోకి ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే పూర్వీకులు ఎప్పుడో సంప్రదాయంగా చిత్రీకరించిన బొమ్మలను ఇప్పుడు ప్రచారం చేయడం తగదని భజరంగ్ సేన ప్రెసిడెంట్ జ్యోతి అగర్వాల్ పేర్కొన్నారు. ‘‘బొమ్మల్లో చిత్రీకరించి ఉన్నంత మాత్రాన అలాంటి కార్యకలాపాలకు ఇక్కడ చోటివ్వకూడదు. ఇలాంటి వాటి వల్ల తర్వాతి తరాలకు మనం ఎలాంటి సందేశమిస్తున్నాం? ఇవి ఆథ్యాత్మిక ఉట్టిపడే దేవాలయాలు... ఇక్కడే శివాలయం ఉంది.. ఇలాంటి పవిత్రమైన ప్రదేశాల్లో కామసూత్ర పుస్తకాల అమ్మకాన్ని ఎలా అనుమతిస్తారు?’’ అని ఆమె ప్రశ్నించారు.


Loading...