కర్ణాటకలో పడవ బోల్తా

కర్ణాటకలో పడవ బోల్తా

 బెంగళూరు :కర్ణాటక కోస్తాతీరంలోని కారవార జిల్లాలో సోమవారం సంభవించిన పడవ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఇరువురు చిన్నారులున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కారవార సమీపంలోని కూర్మగడ ద్వీపంలో జరిగే దేవీ జాతరకు వెళ్లేందుకు 26 మంది నాటు పడవలో వెళ్లారు. కాళి నదిలో కొంత దూరం వెళ్లాక అది బోల్తా కొట్టడంతో అందరూ నీళ్లలో పడిపోయారు. వీరిలో ఎనిమిది మంది మృతదేహాలను ఇప్పటి వరకూ వెలికితీసినట్టు ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ ట్వీట్‌ చేసింది. మరో 17 మందిని రక్షించినట్లు తెలిపింది. ఇంకొరి ఆచూకీ తెలియాల్సివుందని పేర్కొంది. పడవ బోల్తా ప్రమాదం సంఘటన జరిగిన వెంటనే స్థానిక జాలర్లు నాటు పడవలతో గాలించి కొందరి మృతదేహాలను వెలికితీశారు. కారవార జిల్లా ఇంఛార్జీ మంత్రి ఆర్‌వి దేశపాండె బెంగళూరు నుంచి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయకచర్యలు పర్యవేక్షించారు.