కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ ఇద్దరు ఉగ్రవాదులు హతం

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ ఇద్దరు ఉగ్రవాదులు హతం

  శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లాలో భద్రతా దళాలకు హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాదులకు మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. గాలింపు చర్యలు చేపట్టి ఉగ్రవాదులపై కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్‌ జరిగిందని తెలిపారు. మృతిచెందిన ఉగ్రవాదులను మొహమ్మద్‌ ఇడ్రీస్‌ సుల్తాన్‌, అమిర్‌ హుస్సేన్‌ రాథార్‌గా గుర్తించారు. వీరు ఉగ్రవాద సంస్థ హెచ్‌ఎంతో అనుబందంగా పనిచేస్తూ భద్రతా దళాలపై దాడులకు పాల్పడినట్లు చెప్పారు. సుల్తాన్‌ అనే ఉగ్రవాది గతంలో భారత దళంలో పనిచేసి ఆతర్వాత ఉగ్రవాదులతో చేరినట్లు అధికారులు పేర్కొన్నారు.