కాశ్మీర్‌లో హై అలర్ట్‌ ప్రకటించిన అధికారులు

కాశ్మీర్‌లో హై అలర్ట్‌ ప్రకటించిన అధికారులు

  శ్రీనగర్‌ : జైష్‌-ఇ-మొహమ్మద్‌కి చెందిన 12మంది ఉగ్రవాదులు జమ్ము-కాశ్మీర్‌లోకి ప్రవేశించారని, పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున దాడులకు చేయనున్నట్లు సమాచారం అందడంతో జమ్ము కాశ్మీర్‌తో పాటు రాజధాని ప్రాంతమైన ఢిల్లీని కూడా అప్రమత్తం చేసినట్లు భద్రతా అధికారులు పేర్కొన్నారు. అధికారుల సమాచారం ప్రకారం కాశ్మీర్‌లోకి చొరబడిన ఉగ్రవాదులు బృందాలుగా విడిపోయి రంజాన్‌ మాసంలో 17వ రోజైన శనివారం భారీ ఎత్తున దాడులు చేయనున్నారని పేర్కొన్నారు.

 క్రీ.పు మార్చి 624 ఎడిలో జరిగిన మొదటి ఇస్లాం యుద్ధం బదర్‌ వార్షికోత్సవం శనివారం కావడంతో దాడులకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. దీంతో అధికారులు ఢిల్లీలోని పలు ప్రాంతాలలో భారీ భద్రతను ఏర్పాటు చేయాలని, రాష్ట్రమంతటా హై అలర్ట్‌ ప్రకటించాల్సిందిగా సూచించారు. గతేడాది బదర్‌ వార్షికోత్సవం సందర్భంగా కాశ్మీర్‌లో జైష్‌కు చెందిన ఉగ్రవాదులు వరుస దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.