కఠ్మాండు ఎయిర్‌పోర్ట్‌లో కుప్పకూలిన విమానం

కఠ్మాండు ఎయిర్‌పోర్ట్‌లో కుప్పకూలిన విమానం

 నేపాల్‌లోని కఠ్మాండు విమానాశ్రయంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఓ విమానం కుప్పకూలిపోయింది. ఢాకా నుంచి ప్రయాణికులతో వస్తున్న విమానం.. ఇక్కడి త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగే సమయంలో ఒక్కసారిగా నిలకడ కోల్పోయి.. క్రాష్‌ ల్యాండ్‌ అయింది. దీంతో విమానం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు వెలువడ్డాయి. ఈ విమానంలో మొత్తం 67మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వీరు ఢాకా నుంచి అమెరికా వెళుతుండగా.. కఠ్మాండు విమానాశ్రయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


ఈ ప్రమాదంలో 17 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వెంటనే నేపాల్‌ ఆర్మీ రంగంలోకి దిగి కూలిన విమానం నుంచి ప్రయాణికులను కాపాడేందుకు సహాయక చర్చలు చేపట్టింది. క్షతగాత్రులైన ప్రయాణికులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తమ కళ్లముందే విమానం క్రాష్‌ల్యాండ్‌ అయిందని, ఒక్కసారిగా దట్టమైన పొగలు ఎగిశాయని ఎయిర్‌పోర్టులో ఆ సమయంలో ఉన్న పలువురు ప్రయాణికులు ట్వీట్‌ చేస్తున్నారు.