కేరళ సిఎంకు తొలి మహిళా సారథి

కేరళ సిఎంకు తొలి మహిళా సారథి

 తిరువనంతపురం : త్రిస్సూర్‌లోని రామవర్మ పురం పోలీస్‌ అకాడమీలో ఈ ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు అధికారుల పాసింగ్‌ ఔట్‌ పెరే డ్‌లో వారి గౌరవ వందనం స్వీకరించిన ముఖ్య మంత్రి పినరయి విజయన్‌ వాహనానికి తొలిసారి టి శశీంద్ర (49) అనే మహిళ సారధ్య బాధ్యతలు నిర్వహించారు. వాస్తవానికి శశీంద్రకు వాహన డ్రైవింగ్‌పై ఎన్నడూ ఆసక్తి లేదు. అయితే 90వ దశకం మధ్యలో కేరళలో మహిళా డ్రైవింగ్‌ శిక్షకులు కొద్దిమంది మాత్రమే వున్నారని తెలుసు కున్న ఆమె ఈ రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. ప్రేమ వివా హం చేసుకున్న ఆమె కుటుంబ సభ్యుల ఆగ్రహానికి గురయ్యారు. దీనితో ఆమె తాను స్వయంపోష కంగా మారటం కోసం ఒక ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అప్పుడు ఆమె ఒక పాత మారుతి-800 కారులో డ్రైవింగ్‌ నేర్చుకుని ఔత్సా హికులకు డ్రైవింగ్‌ నేర్పటం ప్రారంభించారు. అయితే కారు డ్రైవింగ్‌లో తన ప్రతిభ ఒకనాడు ముఖ్యమంత్రి వాహన సారధిగా నిలుపుతుందని ఆమె ఎన్నడూ ఊహించలేదు. ఈ ఊహించని బాధ్యతలు ఇటీవల ఆమెకు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యమంత్రి అధికారిక వాహన సారధి గా ఆమె పోలీస్‌ అకాడమీ పాసింగ్‌ఔట్‌ పెరేడ్‌లో బాధ్యతలను నిర్వహించారు. వాస్తవానికి ఈ సంద ర్భం శశీంద్రకు అత్యంత ప్రత్యేకమైనదని చెప్ప వచ్చు. ఈ పెరెడ్‌లోనే రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వ ర్యంలో ఏర్పడిన తొలి మహిళా బెటాలియన్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులు కూడా పాల్గొ న్నారు.

తన జీవితంలో ఇది అత్యంత ప్రత్యేకమైన సందర్భమని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఒక మీడియా సంస్థకు టెలిఫోన్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ 'ముఖ్యమంత్రి వాహన సారధ్య బాధ్యతలు అత్యంత సంక్లిష్టమైనవి. ఒక్క చిన్న పాటి పొరపాటు జరగటానికి వీలు లేదు. వాహనానికి ఏ మాత్రం కుదుపు లేకుండా నడ పాలి. దీనికి నేను ముందు మానసికంగా సిద్ధపడ్డా ను. ఉదయం, సాయంత్రం రోజు రెండు సార్లు చొప్పున దాదాపు మూడు వారాల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను' అని ఆమె వివరించారు. ప్రస్తుతం త్రిస్సూర్‌ జిల్లా కమిషనర్‌ కార్యాలయంలో సిపిఓగా పనిచేస్తున్న ఆమె పోలీసు శాఖలో 14 ఏళ్ల సర్వీ సును పూర్తిచేశారు. అనేక సంవత్సరాల పాటు మహిళా హెల్ప్‌లైన్‌ బృందానికి సంబంధిం చిన స్క్వాడ్‌ కార్లను ఆమె నడి పారు.

ఇప్పుడు ఆమె బస్సులు, ట్రక్కులు వంటి భారీ వాహనా లను కూడా సునాయాసంగా నడపగలనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో పాసింగ్‌ ఔట్‌ పెరేడ్‌ లలో పాల్గొంటున్న ప్రముఖుల వాహనాల సారధ్య బాధ్యతలను పురుషులకే ఎందుకు అప్పగిస్తారన్నది తనకు ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తుందని ఆమె చెప్పారు. ఇప్పుడు తమ పోలీసు శాఖ ఈ బాధ్యత లను అప్పగించటం తనకు సంతోషాన్ని కలిగించిం దని ఆమె అన్నారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో శశీంద్ర అప్పటి హోం మంత్రి రమేష్‌ చెన్నితల, విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్యదన్‌ మహ్మద్‌ల కార్లకు డ్రైవర్‌గా పనిచేశారు. శశీంద్ర భర్త జయన్‌ తాము నివశిస్తున్న చెర్పు సమీపంలో ఒక డ్రైవింగ్‌ స్కూల్‌ను నిర్వహిస్తున్నారు. ఈ జంటకు అనఘ అనే కుమార్తె వుంది.