కేవలం రాత్రి సమయంలోనే కండోమ్ యాడ్స్!

కేవలం రాత్రి సమయంలోనే కండోమ్ యాడ్స్!

 న్యూఢిల్లీ : కండోమ్ యాడ్స్ ను కేవలం రాత్రి సమయంలోనే అనుమతించాలని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఏఎస్‌సీఐ) సూచించింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఎస్‌సీఐ తెలిపింది. అయితే రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు మాత్రమే కండోమ్ యాడ్స్ ను టీవీల్లో ప్రసారం చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ యాడ్స్ ను కేవలం పెద్దలు మాత్రమే చూసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఏఎస్‌సీఐకి సూచించింది.

కండోమ్ పై టీవీల్లో వస్తున్న వాణిజ్య ప్రకటనలపై మహారాష్ట్ర మహిళా కమిషన్ సమీక్షించి విషయాన్ని ఏఎస్‌సీఐ దృష్టికి తెచ్చింది. సన్నీలియోన్ కండోమ్ వాణిజ్య ప్రకటన గురించి మహారాష్ట్ర మహిళా కమిషన్ ప్రకటనల విభాగం యొక్క సుప్రీం స్వీయ-నియంత్రణ సంస్థ అయిన ఏఎస్‌సీఐ కు ఫిర్యాదు చేసింది. కండోమ్ ప్రకటనలు రాత్రివేళల్లో మాత్రమే ప్రసారమయ్యేలా చూడాలని అన్ని టెలివిజన్ చానెళ్లకు తాము సలహా ఇస్తామని ఏఎస్‌సీఐ పేర్కొంది. వాణిజ్య ప్రకటనల్లో ముఖ్యంగా మహిళల చిత్రణలో అసభ్యత, అశ్లీలత లేకుండా చూడాలని సూచించింది.