కొచ్చి షిప్‌యార్డ్‌లో పేలుడు:ఐదుగురు మృతి

కొచ్చి షిప్‌యార్డ్‌లో పేలుడు:ఐదుగురు మృతి

  కొచ్చిః కొచ్చి షిప్‌యార్డ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మొబైల్ ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్ యూనిట్లో మరమ్మతులు జరుగుతున్న సమయంలో పేలుడు జరగడంతో ఐదుగురు మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. మరో ఇద్దరు లోపలే చిక్కుకుపోయినట్లు సమాచారం. పేలుడుకు కారణాలు ఇంకా తెలియలేదు. ప్రమాదం జరిగిన యూనిట్ ఓఎన్జీసీకి చెందినది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, ఫైరింజన్లు అక్కడికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గాయపడిన వారిని దగ్గర్లోని హాస్పిటల్స్‌కు తరలించారు. దేశంలోనే ఓడల తయారీ, మరమ్మతులకు కొచ్చి షిప్‌యార్డ్ కేంద్రం. దేశానికి చెందిన తొలి ఎయిర్‌క్రాఫ్ట్ కేరియర్ ఐఎన్‌ఎస్ విక్రాంత్ ఇక్కడే తయారైంది.