కుమార స్వామికి పరీక్ష

కుమార స్వామికి పరీక్ష

  బెంగళూరు- ప్రజాశక్తి ప్రతినిధి : కర్నాటకలోని జెడిఎస్‌- కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఇంకా అనిశ్చితతోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రభుత్వా నికి మరో పరీక్ష ముంచుకొచ్చింది. ఈ నెల 29 నుంచి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభం కానున్నా యి. తొలి దశలో 105 స్థానాలకు ఎన్నికలు జరగనున్నా యి. అయితే ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలా.. వద్దా.. అనే విషయంపై కాంగ్రెస్‌, జెడిఎస్‌ పార్టీలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్‌లో ఉన్నత స్థాయి నాయ కులు కలిసి పోటీ చేయడానికి అనుకూలంగా ఉండగా, జిల్లా, తాలుకా స్థాయిల్లోని రెండో శ్రేణి నాయకులు జెడి ఎస్‌తో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు జెడిఎస్‌ లోనూ పరిస్థితి ఇదే విధంగా ఉంది.