లింగమార్పిడితో నేవీ ఉద్యోగం పోయింది!

లింగమార్పిడితో నేవీ ఉద్యోగం పోయింది!

 న్యూఢిల్లీ: లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న ఓ నావికుడిని భారత నౌకాదళం విధుల నుంచి తప్పించింది. మనీష్ కుమార్ గిరి అనే నావికా ఉద్యోగి ఏడేండ్లుగా విశాఖపట్నంలోని తూర్పునౌకాదళంలో ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల ఆగస్టులో ఆయన సెలవు తీసుకుని ఢిల్లీలోని ఓ దవాఖానలో లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. తన పేరును సబీగా మార్చుకున్నారు. 22రోజుల తర్వాత తిరిగి ఉద్యోగానికి వచ్చిన మనీష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే చికిత్స సమయంలో మనీష్ (సబీ) లింగమార్పిడి విషయం వెల్లడైంది.

దీనిపై నౌకాదళ అధికారులు స్పందిస్తూ.. ఇది సర్వీసు నింబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టంచేశారు. ఆగస్టులో ఈమేరకు రక్షణశాఖకు ఈవ్యహారాన్ని నేవీ విభాగం రిపోర్ట్ చేసింది. తదుపరి ఆదేశాలకు అనుగుణంగా సబీగా మారిన మనీష్‌ను ఇటీవల విధుల్లోంచి తొలగించింది. అయితే నేవీ నిర్ణయం ట్రాన్స్‌జెండర్ల హక్కులను కాలరాసేలా ఉందన్న చర్చ మొదలైంది. నేను దృఢంగా ఉన్నానని నిర్ధారించుకున్నాకే ఇండియన్ నేవీ నాకు ఉద్యోగమిచ్చింది. ఇప్పుడు కేవలం ఒక అవయవాన్ని మార్చుకున్నానన్న కారణంగా ఉద్యోగానికి అనర్హురాలినెలా అవుతాను? అని బాధితురాలు ప్రశ్నించారు. తన హక్కుల కోసం సుప్రీంకోర్టుకు వెళ్తానని తెలిపారు.