లోయలో పడ్డ మినీ బస్సు : 20 మంది మృతి

లోయలో పడ్డ మినీ బస్సు : 20 మంది మృతి

  శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కేలామోత్ వద్ద జాతీయ రహదారిపై వెళ్తున్న మినీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదం శనివారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు, పోలీసులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు. మృతదేహాలను లోయలో నుంచి బయటకు తీసుకువచ్చారు.