లోయలో పడిన బస్సు : 11 మంది మృతి

లోయలో పడిన బస్సు : 11 మంది మృతి

 ఐజ్వాల్‌ : మిజోరాంలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పంగ్జ్వాల్‌ గ్రామ సమీపంలో బస్సు లోయలో పడిన ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 21 మంది గాయాలపాలయ్యారు. పర్వత వాలులో ప్రయాణిస్తున్న సమయంలో బస్సు అదుపుతప్పి లోయలో పడినట్లు తెలుస్తోంది.

ప్రమాద సమయంలో క్లీనర్‌ డ్రైవింగ్‌ చేస్తున్నట్లు సమాచారం. బస్సు ఐజ్వాల్‌కు వెళ్తోందని పోలీసులు తెలిపారు. గాయాలపాలైన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద కారణాలను తెలుసుకునేందుకు యత్నిస్తున్నట్లు వెల్లడించారు.