మహారాష్ట్రలో ఘోర పడవ ప్రమాదం : ఆరుగురు మృతి

మహారాష్ట్రలో ఘోర పడవ ప్రమాదం : ఆరుగురు మృతి

 ముంబై : మహారాష్ట్ర నందూర్బర్ జిల్లాలో సంక్రాంతి పర్వదినం వేళ విషాదం నెలకొంది. జనాలతో వెళ్తున్న పడవ.. నర్మదా నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం నుంచి 36 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరందరిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని సమీప గ్రామాల ప్రజలు నర్మదా నదిలో పూజలు చేసేందుకు పడవలో బయల్దేరారు. అయితే సామర్థ్యానికి మించి పడవలో జనాలు ఎక్కడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో సుమారు 60 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. క్షతగాత్రుల బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.