మంచువర్షంతో  500 కోట్ల పంట నష్టం

మంచువర్షంతో  500 కోట్ల పంట నష్టం

  జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్ లో కొంతకాలంగా కురుస్తున్న మంచువర్షంతో అక్కడి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న మంచు వర్షం ధాటికి వ్యవసాయ, ఉద్యానవన విభాగాల్లో రూ.500 కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు జమ్మూకశ్మీర్ ప్రధాన కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం 53 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటల నష్టం, 9 వేల హెక్టార్లలో ఉద్యానవన పంటల నష్టం జరిగినట్లు తెలిపారు. కేంద్రప్రభుత్వం జమ్మూకశ్మీర్ రైతులను ఆదుకోవాలని సుబ్రమణ్యం కోరారు.