మయన్మార్‌ మారణ కాండకు ఏడాది

మయన్మార్‌ మారణ కాండకు ఏడాది

  న్యూఢిల్లీ : సైనిక అణచివేత కారణంగా స్వదేశమైన మయన్మార్‌ను వదిలి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా బంగ్లాదేశ్‌లోని దాదాపు 7 లక్షల మంది రోహింగ్యాలు శనివారం ''బ్లాక్‌ డే''ను పాటించారు. మయన్మార్‌లో సైనిక వేధింపులు భరించలేక బంగ్లాదేశ్‌కు పారిపోయి వచ్చిన వారి భవిష్యత్‌ మసకబారింది. వారికి నిలువ నీడ కనిపించడం లేదు. మయన్మార్‌లోని రాఖీన్‌ రాష్ట్రంలో 2017, ఆగస్టు 25న రోహింగ్యాలపై సైనిక దాడులు జరిగాయి. ఐక్యరాజ్య సమితి దీనిని జాతి నిర్మూలనగా పేర్కొంది. పెద్ద సంఖ్యలో రోహింగ్యాలు కాలినడకన, పడవలలో పొరుగు దేశాలు చేరుకున్నారు.బంగ్లాదేశ్‌లోని కాక్స్‌ బజార్‌ జిల్లాలోని శిబిరాలలో తలదాచుకున్న రోహింగ్యాలు శనివారాన్ని తమ జీవితాలలో 'బ్లాక్‌ డే'గా పరిగణిస్తూ ప్రార్థనలు జరిపారు. పాటలు పాడారు. మరి కొందరు తమ పరిస్థితిపై ప్రసంగాలిచ్చారు.