మెట్రో మేనేజర్‌పై సిఆర్‌ఎస్‌ఎఫ్‌ దాడి

మెట్రో మేనేజర్‌పై సిఆర్‌ఎస్‌ఎఫ్‌ దాడి

 న్యూఢిల్లీ : ద్వారకా సెక్టార్‌ 21, జనకపురి మధ్య తిరిగే స్థానిక మెట్రో బ్లూ లైన్స్‌ సర్వీసులను కొద్ది సేపు నిలిపివేసినట్లు మెట్రో రైల్వే సిబ్బంది తెలిపారు. ద్వారకా స్టేషన్‌ వద్ద స్టేషన్‌ మేనేజర్‌ను సెంట్రల్‌ ఇండిస్టీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సిఐఎస్‌ఎఫ్‌) సిబ్బంది దాడి చేయడంతో నిరసనగా మెట్రో ఉదోగులు సర్వీసును నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం ద్వారకా సెక్టార్‌ 21 స్టేషన్‌లో మేనేజర్‌పై సిఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది దాడి చేశారని పేర్కొన్నారు. అనంతరం మెట్రో అధికారులు సిఐఎస్‌ఎఫ్‌ దాడి ఆరోపణలపై విచారణకు ఆదేశించిన అనంతరం రాత్రి 9.00 గంటలకు తిరిగి సేవలను పునరుద్దరించినట్లు తెలిపారు.