మున్సిపాలిటీ లోని వైన్‌షాపులకు సుప్రీంకోర్టు ఊరట

మున్సిపాలిటీ లోని వైన్‌షాపులకు సుప్రీంకోర్టు ఊరట

ఢిల్లీ: హైవేలపై 500 మీటర్ల దూరం వరకు ఎలాంటి వైన్‌షాపులు ఉండకూడదని గతేడాది డిసెంబర్‌లో సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.గతంలో ఓ పిటిషన్ సందర్భంగా పంజాబ్‌లోని మున్సిపల్ ప్రాంతాల్లో ఉన్న వైన్‌షాపులకు నిషేధం నుంచి మినహాయింపునిచ్చినట్లు సుప్రీంకోర్టు తెలిపింది. దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిందిగా ఓ అడ్వొకేట్ మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది అయితే దీనిపై సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు సూచించింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గి ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అయితే తాము మున్సిపల్ ఏరియాల్లో ఉన్న వైన్‌షాపులు అన్నామంటే...కేవలం పంజాబ్‌కు పరిమితం కాదని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపల్ ఏరియాల్లోని వైన్‌షాపులకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.