ఒక్కే యాప్ లో 100 ప్రభుత్వ సేవలు

ఒక్కే యాప్ లో 100 ప్రభుత్వ సేవలు

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఉమంగ్ యాప్ పేరుతో ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది. సైబర్ స్పేస్ అంశంపై గురువారం ఢిల్లీలో జరిగిన గ్లోబల్ కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ ఈ యాప్‌ను ప్రారంభించారు. ప్రభుత్వ సేవలను ప్రజల చెంతకు చేర్చేందుకు డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ యాప్‌ను రూపొందించినట్టు చెప్పారు. 

దేశం లో ప్రభుత్వ సేవలన్నింటికీ ఒక్కో యాప్ అందుబాటులో ఉన్నది.  కరెంటు బిల్లు చెల్లించడానికి ఓయాప్, గ్యాస్ బుకింగ్, ఇన్‌కం ట్యాక్స్ ఫైలింగ్, పీఎఫ్ చెకింగ్, ఈ-ఆధార్, డిజీలాకర్ ఇలాంటి వన్నీ మనకు తరుచూ ఉపయోగపడేవే. కానీ వీటన్నింటినీ ఫోన్‌లో ఒకేసారి ఇన్‌స్టాల్ చేసుకోలేని పరిస్థితి. ఇవన్నీ ఒకే యాప్‌లో కలిసి ఉంటే.. దాదాపు 100 రకాల ప్రభుత్వ సేవలు ఒక్క యాప్‌తోనే మన అరచేతిలోకి ఉమంగ్ యాప్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తేసుకోచింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 100 రకాల సేవలను ఒకే ప్లాట్‌ఫాం ద్వారా అందిస్తామన్నారు. ఈ యాప్‌ను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ (ఉమంగ్) పేరుతో రూపొందించింది. ప్రస్తుతం 45 సేవలను అనుసంధానించారు. త్వరలో వీటిని వందకు విస్తరించనున్నారు.

ఈ-ఆధార్, డిజీ లాకర్, వివిధ బిల్లుల చెల్లింపు, ఇన్‌కంట్యాక్స్ ఫైలింగ్, గ్యాస్ సిలిండర్ బుకింగ్, పీఎఫ్‌తోపాటు ఆధార్, పాన్ ఆధారిత సేవలు, వివిధ ప్రభుత్వ శాఖల సేవలను ఉమంగ్‌తో పొందవచ్చు. కంప్యూటర్ వెర్షన్‌తోపాటు, ఐవీఆర్, ఎస్‌ఎంఎస్ ద్వారా ఫీచర్ ఫోన్లలోనూ సేవలు పొందేలా ఉమంగ్‌లో ఏర్పాట్లు చేశారు.

వినియోగదారులు ముందుగా ప్లేస్టోర్‌కు వెళ్లి ఉమంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదా 97183 97183 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే లింక్ వస్తుంది. ఈ లింక్ ఆధారంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులోని అప్లికేషన్‌లో వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతాలు, తదితర వివరాలు నమోదుచేసి ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత సర్వీసెస్ విభాగంలోకి వెళ్లి మనకు కావాల్సిన సేవలను వినియోగించుకోవచ్చు. దీనికి అనుసంధానంగా కస్టమర్‌కేర్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.