‘పాక్ బాలుడి త‌ల్లిదండ్రుల‌కు వీసా ఇస్తాం’

‘పాక్ బాలుడి త‌ల్లిదండ్రుల‌కు వీసా ఇస్తాం’

 న్యూఢిల్లీ:   పంజాబ్‌ ఫరీద్‌కోట్‌లోని అబ్జర్వేషన్‌ హోంలో ఉన్న 12 సంవత్సరాల పాకిస్తాన్‌ బాలుడిని కలిసేందుకు అతడి తల్లిదండ్రులకు వీసా ఇస్తామని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ చెప్పారు.  కాగా గత మే నెలలో బిఎస్‌ఎఫ్‌ జవాన్లు ఆ బాలుడిని భారత సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నారు. అతడిని ఫరీద్‌కోట్‌లోని అబ్జర్వేషన్‌ హోంకు తరలించారు. పాక్‌లోని సాయిల్‌కోట్‌ ప్రాంతంలోని పసూర్‌నుంచి హమ్మద్‌ హసన్‌ అనే బాలుడు తప్పిపోయాడని పాకిస్తాన్‌కు చెందిన జర్నలిస్టు మెహర్‌తరార్‌ సుష్మా స్వరాజ్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సుష్మా స్వరాజ్‌ స్పందిస్తూ 12 ఏళ్ల బాలుడు ఫరీద్‌కోట్‌ అబ్జర్వేషన్‌ హోంలో ఉన్నాడని, పాకిస్తాన్‌ ఆ బాలుడి జాతీయతను ధృవీకరించే విషయమై తాము ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు.